- ఉమ్మడి జిల్లాలో మహిళలకు పెద్దపీట
- ఆర్మూర్, భీంగల్, కామారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలు మహిళలకే..
- బోధన్ చైర్మన్ జనరల్, బిచ్కుంద బీసీ జనరల్, ఎల్లారెడ్డి అన్ రిజర్వుడ్
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్లలో ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. నిజామాబాద్నగర పాలక సంస్థ మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్అయ్యింది. ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ చైర్పర్సన్ పదవులు జనరల్ మహిళలకు కేటాయించగా, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ చైర్మన్ పదవులు బీసీ మహిళలకు రిజర్వ్అయ్యాయి. నిజామాబాద్జిల్లా బోధన్ మున్సిపల్‌చైర్మన్ పదవి జనరల్‌కు కేటాయించగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద బీసీ జనరల్, ఎల్లారెడ్డి అన్రిజర్వుడ్అయ్యింది.
మహిళలకు కేటాయించే 50 శాతం స్థానాల కోసం ఇరు జిల్లాల కలెక్టరేట్లలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, ఇలా త్రిపాఠి డ్రా తీశారు. చైర్మన్ పదవులను హైదరాబాద్‌లో ఎంపిక చేయగా, మున్సిపాలిటీల పరిధిల్లో వార్డుల రిజర్వేషన్లను నిర్ణయించారు.
ఆర్మూర్మున్సిపాలిటీ..
ఆర్మూర్మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. ఇందులో 9, 11, 13, 26, 30, 31, 32, 34, 35 వార్డులు జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. జనరల్ మహిళ 3, 5, 12, 15, 16, 19, 21, 29, 33, 36 వార్డులు, బీసీ జనరల్ 7, 10, 14, 18, 23, 24, 25 వార్డులు, బీసీ మహిళ 1, 6, 17, 20, 22, 27, 28 వార్డులు, ఎస్సీ జనరల్ 4వ వార్డు, ఎస్సీ మహిళ 8వ వార్డు, ఎస్టీ జనరల్ 2వ వార్డు రిజర్వ్ అయ్యాయి.
బోధన్ మున్సిపాలిటీ..
బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులు ఉన్నాయి. ఇందులో 15, 17, 18, 21, 25, 27, 30, 37 వార్డులు జనరల్‌కు రిజర్వ్అయ్యాయి. జనరల్ మహిళకు 1, 3,11, 20, 28, 29, 31, 32, 33, 36, 38 వార్డులు, బీసీ జనరల్ 2, 5, 6, 9, 12, 22, 26, 34 వార్డులు, బీసీ మహిళ 4, 7, 8, 14, 19, 23, 35 వార్డులు, ఎస్సీ జనరల్ 13, 16 వార్డులు, ఎస్సీ మహిళ 10వ వార్డు, ఎస్టీ జనరల్ 24వ వార్డు కేటాయించారు.
భీంగల్ మున్సిపాలిటీ...
భీంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 1, 3 వార్డులు జనరల్‌కు రిజర్వ్అయ్యాయి. జనరల్ మహిళ 4, 5, 6, 10 వార్డులు, బీసీ జనరల్ 7, 9 వార్డులు, బీసీ మహిళ 12వ వార్డు, ఎస్సీ జనరల్ 8వ వార్డు, ఎస్సీ మహిళ 2వ వార్డు, ఎస్టీ జనరల్ 11వ వార్డు రిజర్వ్ అయ్యింది.
కామారెడ్డి మున్సిపాలిటీ..
కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీకి 2వ వార్డు, ఎస్సీ మహిళలకు 13, 20 వార్డులు, ఎస్సీ జనరల్‌కు 26, 32 వార్డులను కేటాయించారు. బీసీ మహిళలకు 7, 14, 15, 16, 34, 38, 40, 47, 48 వార్డులు రిజర్వ్అయ్యాయి. బీసీ జనరల్‌కు 4, 6,17, 24, 25, 36, 37, 43, 45, 49 వార్డులను కేటాయించారు. 5, 10, 11, 12, 21, 22, 23, 27, 30, 35, 41, 42, 44 వార్డులను జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. 1, 3, 8, 9, 18, 19, 28, 29, 31, 33, 39, 46 వార్డులను అన్‌రిజర్వుడ్ చేశారు.
బాన్సువాడ మున్సిపాలిటీ..
బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీ జనరల్10వ వార్డు, ఎస్సీ మహిళ- 8వ వార్డు, ఎస్సీ జనరల్ 4వ వార్డు, బీసీ మహిళ- 7, 17, 18 వార్డులు, బీసీ జనరల్ - 2, 15, 19 వార్డులు, జనరల్ మహిళ- 1, 5, 6, 9, 14 వార్డులు, అన్ రిజర్వుడ్‌గా - 3, 11, 12, 13, 16 వార్డులు కేటాయించారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీ జనరల్- 12వ వార్డు, ఎస్సీ మహిళ-11వ వార్డు, ఎస్సీ మహిళ- 5వ వార్డు, బీసీ మహిళ- 3వ వార్డు, బీసీ జనరల్- 9, 10 వార్డులు, జనరల్ మహిళ- 1, 2, 4, 7 వార్డులు, అన్‌రిజర్వుడ్‌గా- 6, 8 వార్డులను కేటాయించారు.
బిచ్కుంద మున్సిపాలిటీ..
బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీ - 6వ వార్డు, ఎస్సీ మహిళ - 5వ వార్డు, ఎస్సీ జనరల్- 1వ వార్డు, బీసీ మహిళ- 10వ వార్డు, బీసీ జనరల్- 8, 9 వార్డులు, జనరల్ మహిళ 3, 4, 11,12 వార్డులు, 2, 7 వార్డులు అన్‌రిజర్వుడ్ అయ్యాయి.
నిజామాబాద్కార్పొరేషన్..
నిజామాబాద్కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో జనరల్‌కు 1, 4, 5, 8, 10, 18, 19, 25, 26, 30, 35, 47, 50, 55 డివిజన్లు రిజర్వ్ అయ్యాయి. జనరల్ మహిళ 3, 6, 9, 11, 21, 24, 27, 29, 31, 32, 33, 34, 36, 49, 53, 54 డివిజన్లు, బీసీ జనరల్ 7, 14, 15, 28, 38, 42, 43, 46, 48, 51, 52, 58 డివిజన్లు కేటాయించారు. బీసీ మహిళ 12, 16, 20, 22, 23, 37, 41, 45, 56, 57, 59, 60 డివిజన్లు, ఎస్సీ జనరల్ 2, 40, 44 డివిజన్లు, ఎస్సీ మహిళ 17, 39 డివిజన్లు, ఎస్టీ జనరల్ 13వ డివిజన్ రిజర్వ్ అయ్యింది.
