- పోలీస్ స్టేషన్లలో బ్యాలెట్ పేపర్లు
- సెంటర్లకు బ్యాలెట్ బాక్సులు .. 3 వేల మంది స్టాఫ్
- బస్సులు సహా 164 వెహికల్స్.. 14 సెంటర్లలో వెబ్ కాస్టింగ్
యాదాద్రి, వెలుగు: మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. బ్యాలెట్ పేపర్లు, బాక్సుల తరలింపు పూర్తయింది. ఎన్నికల ప్రక్రియలో వేల సంఖ్యలో స్టాఫ్‌ను ఎంపిక పూర్తయింది. పోలింగ్ సెంటర్లలో వెబ్ కాస్టింగ్ కూడా చేయనున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ఫస్ట్ ఫేజ్‌లో 137
యాదాద్రి జిల్లాలో ఫస్ట్ ఫేజ్‌లో ఆరు మండలాల్లోని 153 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 1,62,401 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 80,497 కాగా, మహిళలు 81,902, ఇద్దరు థర్డ్జెండర్లు ఉన్నారు. కాగా ఇందులో 16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే 11 పంచాయతీల్లో మొత్తం పాలకవర్గం ఏకగ్రీవం కాగా, 5 పంచాయతీల్లో వార్డు మెంబర్లకు ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో 137 పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 397 మంది పోటీ పడుతున్నారు. 1040 వార్డులకు 2436 మంది పోటీ పడుతున్నారు.
పోలీస్ స్టేషన్లకు బ్యాలెట్ పేపర్లు
ఎన్నికలు జరగాల్సిన పంచాయతీలకు, వార్డు స్థానాలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు ఆలేరు, ఆత్మకూరు(ఎం), బొమ్మల రామారం, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లకు చేరాయి. 135 పంచాయతీల ఓటర్లకు సంబంధించి పింక్ బ్యాలెట్ పేపర్లు, 1040 వార్డులకు సంబంధించి వైట్ కలర్ బ్యాలెట్‌పేపర్లను పంచాయతీల వారీగా డివైడ్ చేసి పంపించారు. వీటిని ఈ నెల 10న రాత్రి తరలిస్తారు. అదే విధంగా బ్యాలెట్ బాక్సులు సహా పోలింగ్ రోజున అవసరమయ్యే 53 రకాల సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సెంటర్లకు తరలిస్తారు.
ఫస్ట్ ఫేజ్ కోసం..
మూడు దశల్లో జరిగే ఎన్నికల కోసం మొత్తంగా 8 వేల మంది విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో ఫస్ట్ ఫేజ్ కోసం మూడు వేల మందిని విధులు నిర్వహించనున్నారు. అయితే వీరికి ఈ నెల 10న ఏయే పంచాయతీల్లో విధులు నిర్వర్తించాలో చెబుతారు. 23 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 38 మంది జోనల్ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తారు. స్టాఫ్ కోసం 126 బస్సులు, జోనల్ ఆఫీసర్ల కోసం 38 వెహికల్స్‌ను ఏర్పాటు చేశారు.
52 సెన్సిటివ్ సెంటర్లు
ఎన్నికలు నిర్వహించే 1040 సెంటర్లలో 52 సెన్సిటివ్ సెంటర్లుగా ఆఫీసర్లు గుర్తించారు. ఆత్మకూరు (ఎం), రాజాపేటలోని 14 పోలింగ్ సెంటర్లలో వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు నుంచి మూడు పోలింగ్ సెంటర్లకు ఒక వెహికల్లో పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారు.
