వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు

వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు

 వైసీపీ నేత వైసీపీ నేత నారాయణరెడ్డి హత్యకేసులోని 11 మంది నిందితులను దోషులుగా గుర్తించిన  కర్నూలు జిల్లా కోర్టు జీవితఖైదుతో పాటు రూ. వెయ్యి రూపాయిలు విధించింది.  మరో ఐదుగురిపై నేరం రుజువు కానందున వారికి ఈ కేసు నుంచి కర్నూలు  జిల్లా ప్రధాన న్యాయమూర్తి  విముక్తి కలిగించారు.  తీర్పు అనంతరం చెరుకులపాడు..  తొగట్చేడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ కేసు వివరాల్లోకివెళ్తే 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డిపై క్రిష్ణగిరి మండలంలో హత్య జరిగింది. ఈ దాడిలో నారాయణరెడ్డితోపాటు అతని అనుచరుడు సాంబశివుడు కూడా హత్యకు గురయ్యారు. నారాయణరెడ్డి అనుచరుడు కృష్ణమోహన్​  ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 17 మంది నిందితులపై కేసు నమోదు చేశారు.

రామకృష్ణాపురంలో వివాహానికి హాజరై వస్తుండగా క్రిష్ణగిరి సబ్ స్టేషన్ దగ్గర.. నారాయణరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.  రాజకీయ ప్రత్యర్థులు కాపుగాసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటనలో నారాయణరెడ్డి తో పాటు ఆయన అనుచరుడు బోయ సాంబశివుడు కూడా హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యల కేసులో 17 మంది నిందితులు కాగా ఒకరు మృతి చెందారు. ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా గతంలో నిందితుడిగా ఉండేవారు. అయితే అప్పట్లోనే ఆయన పేరును కోర్టు తొలగించింది. సుదీర్ఘకాలం విచారణ అనంతరం 11 మందికి శిక్ష విధించింది కోర్టు.. సాక్షాధారాలు రుజువు కాకపోవడంతో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.