
హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ సీజన్ లో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ రోజు అంటే జూన్ 13వ తేదీన రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురస్తుందని చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలో రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. వర్ష సూచనతో GHMC, సంబంధిత అధికారులను అలెర్ట్ చేసింది ఐఎండీ. హైదరాబాద్ తో పాటుగా పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సికింద్రాబాద్, బోడుప్పల్, పిర్జాదిగూడ ప్రాంతాలలో అక్కడక్కడ స్పల్పంగా వర్షం కురుస్తుంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.