డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్యాయత్నం

డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని  యువకుడి  ఆత్మహత్యాయత్నం

తంగళ్లపల్లి, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్​బెడ్రూం ఇండ్ల పంపిణీలో తమ పేరు రాలేదని ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో గతంలో 27 డబుల్​బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు పంచలేదు. 

కాగా ఇటీవల వాటికి సంబంధించిన లిస్ట్​ విడుదల చేశారు. దీనిపై గ్రామానికి చెందిన భరన్​అనే యువకుడు తనకు ఇల్లు రాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకుంటానని పురుగుమందు డబ్బా పట్టుకొని కుటుంబసభ్యులకు వీడియో కాల్​చేశాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు భరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గరికి వెళ్లి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు. కాగా తనకు ఇల్లు రాకపోవడానికి ఓ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత కారణమని యువకుడు ఆరోపించాడు.