
- సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన లింగాయత్ సమాజ సభ్యులు
జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ పట్టణంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వీరశైవ లింగాయత్ సమాజానికి ప్రార్థనలు చేసుకునేందుకు సరైన అనుభవ మంటపం, శివైక్యం చెందినవారిని ఖననం చేసేందుకు సరిపడా రుద్రభూమి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాజ సభ్యులు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
అనుభవ మంటపం, రుద్ర భూమి కోసం పదెకరాల స్థలాన్ని కేటాయించాలని జహీరాబాద్ లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు రాజశేఖర్ షెట్కార్, ప్రధాన కార్యదర్శి సుభాష్ సీఎంకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో లింగాయత్ సమాజ్ ప్రముఖులు పాల్గొన్నారు.