ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు ( ఆగస్టు 6) ఫ్రెండ్ షిప్ డే సంబరాల్లో మునిగితేలారు. వారికి ఇష్టమైన స్నేహితులను కలుస్తూ.. విషెస్ చెప్పుకున్నారు. ఇక స్నేహితుల దినోత్సవం(Friend Ship Day) రోజున ( ఆగస్టు 6) జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ డెలివరీ ఏజెంట్ అవతారమెత్తారు.
జీవితంలో అందరికీ ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వారే స్నేహితులు... కష్టసుఖాల్లో తోడుంటూ ముందుకు నడిపిస్తుంటారు. సొంతవాళ్లకు చెప్పుకోలేని విషయాలను కూడా ఫ్రెండ్స్‌కు చెప్పుకుంటాం. స్నేహితుల మధ్య నువ్వు- నేను అనే తేడాలు ఉండవు. స్నేహితులు అంటే కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
ఇక స్నేహితుల దినోత్సవం ( Friend Ship Day) సందర్భంగా జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ (Zomato CEO Deepinder Goyal) డెలివరీ ఏజెంట్ అవతారమెత్తారు. ఫ్రెండ్‌షిప్ డే (FriendShip Day) పురస్కరించుకుని తన కంపెనీ డెలివరీ పార్టనర్లు, రెస్టారెంట్ భాగస్వాములు, కస్టమర్‌లకు ఫుడ్‌తో పాటు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లను గిప్ట్‌గా ఇచ్చాడు.
అందులో ఆయన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై జొమాటో టీ షర్ట్ ధరించి హెల్మెట్ పెట్టుకోవడం కనిపిస్తుంది. అంతేకాకుండా జొమాటో బ్రాండింగ్, ఫ్రెండ్ షిప్ కొటేషన్లతో కూడిన హ్యాండ్ బ్యాండ్ లను ఆయన పంపిణీ చేశారు. అప్పుడప్పుడు జొమాటో సీనియర్ ఉద్యోగులు స్వయంగా ఆర్డర్ల డెలివరీ పని చేస్తుంటారు. తద్వారా డెలివరీ భాగస్వాములు, కస్టమర్ల అవసరాలు, ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సేవలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడమే దీని వెనుక ఉన్న లక్ష్యం. అయితే జొమాటో సీఈవో డెలివరీ బాయ్ గా అవతారమెత్తిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ఫ్రెండ్‌షిప్ డే రోజున మా డెలివరీ పార్టనర్లు, రెస్టారెంట్ భాగస్వాములు, కస్టమర్‌లకు కొంచెం ఫుడ్.. అలాగే ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లను డెలివరీ చేయబోతున్న.. ఈ ఆదివారాన్ని (ఆగస్టు6) మర్చిపోలేను” అంటూ ఫొటోలతో కూడిన పోస్ట్‌ను గోయల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
దీపిందర్ గోయల్ షేర్ చేసిన పోస్ట్ ను చూసి యూజర్లు ఉత్సాహంగా కామెంట్లు చేస్తున్నారు. చండీగఢ్ లో మీరు డెలివరీ చేస్తున్నారా? ఏదో ఒక రోజు మిమ్మల్ని నాకు డెలివరీ చేసే పార్ట్ నర్ గా చూస్తానని అనుకుంటున్నాను’’అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

