శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోభారీగా బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోభారీగా బంగారం స్వాధీనం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. అబుదాబి నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి 1.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు . ప్రయాణికుడు బంగారాన్ని బెల్టు రూపంలో తన ప్యాంట్ మరియు లోదుస్తుల్లో దాచాడు. బంగారం విలువ రూ. 45 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  పోలీసులు ప్రయాణికుడిని  అదుపులోకి  తీసుకొని విచారణ జరుపుతున్నారు.