కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. కోటీశ్వరులుగా కోటి మంది మహిళలు

కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. కోటీశ్వరులుగా కోటి మంది మహిళలు

బీహార్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న పోలింగ్ లో గంపగుత్తగా ఓట్లు రాబట్టుకునేందుకు పార్టీలు పోటాపోటీగా బీభత్సమైన హామీలు ఇస్తున్నాయి. 2025, అక్టోబర్ 31వ తేదీన తన మ్యానిఫెస్టోను ప్రకటించింది బీజేపీ పార్టీ. హామీలు ఎలా ఉన్నాయో చూద్దామా..

BJP NDA కూటమి హామీలు :

>>> బీహార్ రాష్ట్రంలో కోటి మంది కంటే  ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం.
>>> ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రం.. అదే స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తారంట. 
>>> స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో శిక్షణ తీసుకునే వాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఉద్యోగాలు ఇప్పించి పంపిస్తారంట. 
>>> మహిళలకు 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తారంట. 
>>> మిషన్ క్రోర్ పతి అనే పథకం ద్వారా.. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. లఖ్ పతి దీదీ అనే పేరు.. ప్రతి మహిళ లక్ష రూపాయలు సంపాదించే విధంగా సంపద సృష్టిస్తారంట. 
>>> EBC.. వెనకబడిన తరగతులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 
>>> రైతులకు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన హామీ ఇచ్చింది. 

ALSO READ :  రోజూ ఒక్క లవంగంతో.. జలుబు..కఫం...

బీహార్ ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టో ఇది. మొన్నటికి మొన్న RJD పార్టీ అధినేత తేజశ్వనీ యాదవ్ సైతం ప్రభుత్వ ఉద్యోగాలపై హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని ప్రకటించారు ఆయన. ఈ లెక్కన బీహార్ రాష్ట్రంలో ఎవరు గెలిచినా ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ..