ట్రాన్స్ జెండర్లకు నెలకు పదికిలోల బియ్యం

ట్రాన్స్ జెండర్లకు నెలకు పదికిలోల బియ్యం

ట్రాన్స్జెండర్లకు పదికిలోల బియ్యం ఇవ్వండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్ జెండర్లకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేకపోయినా నెలకు పది కిలోల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వాన్నిహైకోర్టు ఆదేశించింది. కరోనా ఎఫెక్ట్ తో ఇబ్బంది పడుతున్న ట్రాన్స్జెండర్లకు రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసరాలు, మెడిసిన్, ట్రీట్ మెంట్ ఫ్రీగా ఇచ్చేలా ఆదేశించాలని వైజయంతి వసంత మొగిలి వేసిన పిల్‌ను గురువారం చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌. ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్ బెంచ్‌ విచారించింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ట్రాన్స్జెండర్లకోసం హాస్పిటల్స్ లో స్పెషల్ వార్డు ఏర్పాటు చేశామని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. అదే విధంగా జులై నుంచి నవంబర్ వరకు ట్రాన్ జెండర్లకు నెలకు పది కిలోల చొప్పున బియ్యం ఫ్రీ గా ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశాలిచ్చింది.

For More News..

వీడియో: తిమింగలం మీద దూకి సముద్రంలో ఈదిన ఘనుడు

సమయానికి గర్భవతిని ఆదుకున్న ఎస్ఐ, తహశీల్దార్

ఆపరేషన్ జరుగుతుండగా ఎమ్మెల్యే మృతి