
చెన్నై: తమిళనాడులోని కరూర్ లో తొక్కిసలాట జరిగింది. శనివారం (సెప్టెంబర్27) సాయంత్రం తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్కార్నర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాటలో10 మంది చనిపోయారు. 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతిచెందిన వారిలో ముగ్గురు పిల్లలున్నారని స్థానిక అధికారులు తెలిపారు.
టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి స్పృహ కోల్పోయారు.గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించగా వారిలో 10మంది చనిపోయారు.గాయపడిన వారికి తమిళనాడులోని కరూర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
నామక్కల్ లో ప్రచారాన్ని ముగించిన తర్వాత టీవీకే చీఫ్ విజయ్..కరూర్కార్నర్ మీటింగ్లో ప్రచారం చేశారు. ప్రచార ర్యాలీలో విజయ్ మాట్లాడుతుండగా..భారీ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో చిక్కుకుని చాలా మంది స్పృహ కోల్పోయారు. వారిలో 20 మందికి పైగా ఆసుపత్రుల్లో చేరారు. 10 మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.