టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై 10 లక్షల ఫైన్​

టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై 10 లక్షల ఫైన్​

టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై 10 లక్షల ఫైన్​లు
జనం నుంచి వెయ్యికి పైగా కంప్లయింట్స్ 
కొన్నింటికే జరిమానాలు వేసిన జీహెచ్ఎంసీ 
తలసానికి రూ.2 లక్షలు, దానంకు రూ.లక్ష ఫైన్    

హైదరాబాద్, వెలుగు :  టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లకు జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు భారీగా ఫైన్లు వేశారు. మంగళవారం పెట్టిన ఫ్లెక్సీలతో పాటు బుధవారం మళ్ళీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో ప్రజల నుంచి జీహెచ్ఎంసీకి ట్విట్టర్ లో వెయ్యికిపైగా ఫిర్యాదులు వచ్చాయి. అయితే, జనం నుంచి వచ్చిన ఫిర్యాదులకు మాత్రమే ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు ఫైన్లు విధించారు. నేరుగా వేసిన ఫైన్ లు పదుల సంఖ్యలో కూడా లేవు. అత్యధికంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రూ.2 లక్షలకు పైగా ఫైన్ వేశారు. టీఆర్ఎస్  ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రూ. లక్షకు పైగా, మరో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు రూ.50 వేలకు పైగా ఫైన్లు వేశారు. మొత్తం ప్లీనరీకి సంబంధించి రూ.10 లక్షలకు పైనే జరిమానాలు విధించారు. అయితే, వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చినా నామమాత్రంగా  కొన్నింటికి మాత్రమే ఫైన్ లు వేశారు. సామాన్య ప్రజలు టూ–లెట్ బోర్డులు పెడితేనే ఫైన్లు వేసిన అధికారులు.. టీఆర్ఎస్​ నేతల ఫ్లెక్సీలకు మాత్రం ఫైన్లు వేయడం లేదంటూ సోషల్ మీడియాలో అధికారులపై జనం మండిపడ్డారు.