
క్యాన్సర్..ప్రాణాంతకమైన వ్యాధి..ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది మంది క్యాన్సర్తో పోరాడుతున్నారు. లక్షల మంది ప్రాణాలుకోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 మిలియన్ల మందికి క్యాన్సర్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతోంది. ఈ గణాంకాలు ఆందోళన కలిగించేవే కానీ.. క్యాన్సర్ పేషెంట్లలో ఊరట కలిగించే విషయం ఏమిటంటే ఈ కేసుల్లో దాదాపు 40శాతం వరకు జీవనశైలిలో మార్పుల ద్వారా నివారించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.. ఎలా సాధ్యమో చూద్దాం..
2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 మిలియన్ల మందికి క్యాన్సర్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO లెక్కలు చెబుతోంది. ఆ సంఖ్య అధికంగా అనిపించినప్పటికీ ఆ కేసుల్లో దాదాపు 40శాతం కేసులను జీవనశైలి మార్పుల ద్వారా నివారించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే దాదాపు సగం పోరాటం రోజువారీ అలవాట్లలో మార్పులు, శరీర కదలికలు, తినే తిండిపై ఉందని చెబుతుతున్నాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని నిజంగా తగ్గించే 10 అలవాట్లను పరిశోధనలు వెల్లడించాయి.
రోజువారి ఫుడ్ లో వీటిని చేర్చండి..
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం బెర్రీలు, పాలకూర, క్యారెట్లు,టమోటాలు వంటి ముదురు రంగులతో కూడిన శక్తివంతమైన పండ్లు ,కూరగాయలు రోజువారి ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. కెరోటినాయిడ్లు,ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండే ఆహారాలు రొమ్ము, ఊపిరితిత్తులు,కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ముదురు రంగు ఆహారా పదార్థాలు ఆహ్లాదకరంగా ఉండటమే కాదు.. ఆరోగ్య రక్షణగా కూడా ఉంటాయని వెల్లడించాయి.
రాత్రిభోజనం సమయంలో మార్పులతో..
రాత్రిభోజనం తీసుకునే సమయంలో మార్పులు క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అర్థరాత్రి భోజనం చేయడం వల్ల సిర్కాడియన్ లకు భంగం కలిగించవచ్చు.. ఇది రొమ్ము, ప్రొస్టేట్ హార్మోన్ సంబంధిత క్యాన్సర్లకు దారి తీయవచ్చు అని రీసెర్చర్లు అంటున్నారు. పడుకునే సమయంలో కనీసం రెండు గంటల ముందు రాత్రి భోజనం చేయడం మెరుగైన జీవక్రియకు తోడ్పడుతుందని, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందంటున్నారు.
►ALSO READ | Good Health : వైట్ రైస్.. షుగర్ మధ్య లింక్ ఉందా.. : బెరిబెరి వ్యాధికి కూడా మనం తినే అన్నమేనా..!
భోజనం తర్వాత నడక..
భోజనం లేదా రాత్రి భోజనం తర్వాత 15 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి, కడుపులో మంట తగ్గుతుంది. దీర్ఘకాలిక మంట క్యాన్సర్ అభివృద్ధిలో, ముఖ్యంగా ప్యాంక్రియాటిక్,పెద్దప్రేగు క్యాన్సర్లకు దారి తీసే ప్రమాదం ఉందంటున్నారు. ఇలా రోజు భోజనం తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియకు సహాయంగా,క్యాన్సర్ రాకుండా కవచంగా పనిచేస్తుందంటున్నారు పరిశోధకులు.
గట్ బాక్టీరియాను రక్షించడం ద్వారా..
గట్ మైక్రోబయోమ్ రోగనిరోధక ఆరోగ్యంతో నేరుగా ముడిపడి ఉంది..గట్ ఫ్లోరా పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పెరుగు, ఇడ్లీలు,కొన్ని రకాల ఊరగాయలు వంటి పులియబెట్టిన ఆహారాలు ఈ పర్యావరణ వ్యవస్థను కాపాడుతాయి. సహజ రక్షణను బలోపేతం చేస్తాయి.
నో ప్లాస్టిక్..
ప్లాస్టిక్ బాక్సులు,కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ ఉంచడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఇది చాలా ప్రమాదం అంటున్నాయి పరిశోధనలు.. వీటిలో ఉంచిన పదార్థాలను వేడి చేయడం వల్ల ఎండోక్రైన్ కు అంతరాయం కలిగించే కెమికల్స్ విడుదల కావచ్చు. ఇవి హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్లకు దారి తీస్తాయని చెబుతున్నాయి. గాజు, సిరామిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ ఎంపికలు అనవసరమైన కెమికల్స్ లేకుండా లేదా తగ్గించే ప్రత్యామ్నాయాలు అని చెబుతున్నారు పరిశోధకులు.
మంచి నిద్రతో..
నిద్ర ఎంత ఆరోగ్యానికి ఎంత విలువైనదో మనందరికి తెలుసు. సరియైన నిద్ర లేకపోతే ఆనారోగ్యానికి కారణం కావచ్చు. మెలటోనిన్ స్థాయిలను తగ్గిస్తుంది. మెలటోనిన్ అనేది DNA పాడు కాకుండా రక్షించే మెదడు నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్. ముఖ్యంగా క్యాన్సర్ కారణమయ్యే సిర్కాడియన్( శరీరంలో సాధారణ జీవన చక్రం) అస్తవ్యవస్థం చేస్తుంది. ఫలితంగా రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్లకు దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి సరియైన నిద్ర అవసరం అంటున్నారు.
స్పైసీస్ ఎంపిక ద్వారా..
పసుపు, వెల్లుల్లి ,అల్లం కేవలం రుచిని పెంచేవి మాత్రమే కాదు. పసుపులో ఉండే కుర్కుమిన్ ,వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మంట నిరోధించడం, క్యాన్సర్ నిరోధకంగా ఉపయోగపడుతుందని ప్రయోగశాల అధ్యయనాలలో తేలింది. దీనికి చికిత్స లేనప్పటికీ వంటలలో వాటిని స్థిరంగా జోడించడం వల్ల దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
యోగా సాధన చేయడంద్వారా..
దీర్ఘకాలిక ఒత్తిడి యాంటిబయోటిక్ పనితీరును మారుస్తుంది.బలహీనమైన రోగనిరోధక శక్తి క్యాన్సర్ పెరుగుదలకు కారణం అవుతుంది. ఒత్తిడి తగ్గించాలంటే దీర్ఘ శ్వాస చాలా అవసరం. లేదా ధ్యానం వంటి పద్దతులు కార్టిసాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేసి క్యాన్సర్ ఉన్నవారిలో రోగనిరోధకశక్తి పెరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి.