
మన దేశంలో డయాబెటిస్ చాలా సాధారణమైపోయింది. ఇంట్లో కనీసం ఒక్కరైనా డయాబెటిక్ పేషెంట్ ఉండే పరిస్థితి వచ్చింది. దీనికి లైఫ్ స్టయిల్ నుంచి మొదలుపెడితే అనేక కారణాలు ఉన్నాయి. అయితే, అందులో మనం వైట్ రైస్ ఎక్కువగా తినడమే ప్రధాన కారణమని ఓ స్టడీలో తెలిసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చేసిన స్టడీ కూడా వైట్ రైస్ కి, డయాబెటిస్ కు సంబంధం ఉందని, అందుకే బియ్యం ఎక్కువ తినే దక్షిణాసియా దేశాల్లో డయాబెటిక్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పింది.
ఇండియా, చైనా, బ్రెజిల్ తో పాటు దాదాపు అన్ని ఖండాల నుంచి రీసెర్చర్స్ ఈ స్టడీలో ఇన్వాల్వ్ అయ్యారు. కెనడాలోని మెక్ మాస్టర్ యూనివర్సిటీ లీడ్ చేసిన ఈ వివరాలు 'డయాబెటీస్ కేర్ జర్నల్' ఎడిషన్ లో పబ్లిష్ అయ్యాయి.
వడ్లను మిల్లులో పట్టడం వలన.. గింజపై పొర గట్టిగా ఉండే బయటి పొర... దాని కింద ఉండే మొలకెత్తిన భాగం.. తొలగిపోతుంది. పాలిష్ చేయడం వల్ల బియ్యం తెల్లగా మెరుస్తా యి. ఇవి కంటికి చూడటానికి మంచిగా ఎట్రాక్టి వ్ గా ఉండటమే కాదు... ఎక్కువ రోజులు బియ్యం నిల్వ ఉంచడానికి కూడా ఇది సాయపడుతుంది.. అయితే, మిల్లులో పట్టించడంవల్ల విటమిన్- బి తో పాటు అనేక న్యూట్రిషన్స్ తొలగిపోతాయి. ఈ బియ్యం తిన్నప్పుడు షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. విటమిన్ బి-1 లోపం వల్ల ఆసియాలో తరచుగా వచ్చే బెరిబెరి వ్యాధి వ్యాప్తి కూడా ఈ వైట్ రైస్ తో నే ముడిపడి ఉంది.
2045 నాటికి ఈ సంఖ్య 62.9 కోట్ల మందికి
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి డయాబెటిస్ ఉంది. 2045 నాటికి ఈ సంఖ్య 62.9 కోట్లకు పెరుగుతుందని 'ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్' అంచనా వేసింది. గతంలో జరిపిన ఒక స్టడీ కూడా వైట్ రైస్ కి, డయాబెటిస్ కి సంబంధం ఉందని చెప్పింది. రైస్ తినే వ్యక్తుల్లో షుగర్ వచ్చే చాన్స్ 11 శాతం ఎక్కు వని తేల్చి చెప్పింది.
ఇప్పటివరకు చాలా స్టడీలు ఆయా దేశాలకే పరిమితమయ్యాయి. అయితే ఈ స్టడీని కొన్ని దేశాలను నమునాగా తీసుకున్నారు. అర్జెం టీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, కెనడా, చిలీ, చైనా, కొలంబియా, ఇండియా, ఇరాన్, మలేషియా. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, పోలెండ్, సౌదీ అరేబియాస్వీడన్, టాంజానియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేటర్స్, జింబాబ్వే ఇలా అన్ని దేశాల వాళ్లపై స్టడీ చేశారు.
దక్షిణాసియాలో తెల్ల బియ్యం ఎక్కువగా తింటారు. ఈ లైఫ్ స్టయిల్ డయాబెటిస్ పెరగడానికి కారణం అవుతున్నట్టు తేల్చి చెప్పారు. 'కేవలం వైట్ రైస్ మాత్రమే కాదు. దక్షిణ ఆసియన్లకు డయాబెటిస్ రావడానికి జెనిటిక్ గా ఎక్కువ అవకాశం ఉంది. దీనికి లైఫ్ స్టయిల్ తో పాటు బయలాజికల్ రీజన్స్ కూడా ఉన్నాయివైద్య నిపుణులు చెబుతున్నారు.
దక్షిణ ఆసియాలోనే ఎందుకు?
దక్షిణ ఆసియాలో వైట్ రైస్ కి, డయాబెటిస్ కు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి రీసెర్చర్స్.. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన డేటాను ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చారు. 35 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న 1,32,373 మంది ఈ స్టడీలో పా ల్గొన్నారు. వీళ్లందరినీ పదేళ్లు మానిటర్ చేశారు. వీళ్లలో 6,129 మందికి స్టడీ చేస్తున్నప్పుడు మధ్య లోనే డయాబెటిస్ వచ్చింది. రోజూ యావరేజ్ గా వాళ్లకు 150 గ్రాముల అన్నం పెట్టారు. అయితే, దక్షిణ ఆసియాలో సగటున ఒక వ్యక్తి రోజుకు 630 గ్రాముల రైస్ తింటున్నాడు. ఈ లెక్క ఆగ్నేయ ఆసియాలో 239 గ్రాములు, చైనాలో 200 గ్రాములుగా ఉంది. ఎక్కువ రైస్ తీసుకోవడం వల్ల గోధుమలు, ఫైబర్, రెడ్ మీట్, డైరీ ప్రొడక్ట్స్, పండ్లు తక్కువగా తీసుకుంటున్నారు. దీంతో వీళ్లు తినే ఫుడ్ కార్బోహైడ్రేట్లే దాదాపు 80 శాతం ఉంటున్నాయి.
1970 ప్రాంతం నుంచి పిండి పదార్థాలను అధికంగా పాలిష్ చేయడం మొదలైంది. ఇది ఫుడ్ హ్యాబిట్స్ తో అనేక మార్పులకు కారణమైంది. 'వైట్ రైస్ తినే ప్రతి ఇంట్లో కనీసం ఒక డయాబెటిక్ ఉంటారని, ఎంత మోతాదులో బియ్యం తింటారనే దానిమీదే ఇది ఆధారపడి ఉంటుంది' అని ముంబై న్యూట్రిషియ నిస్ట్ నిపుణులు చెబుతున్నారు.
ఇక్కడ ఇదే ఫుడ్
చైనా, ఇండియా... జనాభాలో ఈ రెండే టాప్. ఈ రెండు దేశాల్లోనూ బియ్యం ఎక్కువగా తింటారు. అయితే, చైనాలో మనకన్నా తక్కువ డయాబెటిక్స్ ఉన్నారు. వాళ్ల లైఫ్ స్టయిల్ వేరు కావడంతో పాటు వీళ్లు స్టిక్కీ రైస్ తినడం దీనికి కారణం కావొచ్చు అని రీసెర్చర్స్ అంటున్నారు. మన దేశానికి మిల్లులు రాకముందు దంచిన బియ్యం తినేవాళ్లు. 1970లలో 2 శాతం డయా బెటిక్స్ ఉంటే.. 2015 నాటికి అది 25 శాతానికి పెరిగింది. వైట్ రైస్‌కి బదులు బ్రౌన్ రైస్ వాడటం గ్లైసెమిక్ రెస్పాన్స్ 23 శాతం తగ్గి.. ఇన్సులిన్ రెస్పాన్స్ 57 శాతం వేగవంతం అవుతుందని స్టడీలు చెప్తున్నాయి. బ్రౌన్ రైస్ అంతగా రుచిగా ఉండకపోవడం వల్ల చాలామంది తినడంలేదు. పేదరికంవల్ల తక్కువప్రోటీన్ తీసుకోవడమే కాకుండా, చీప్ గా దొరికే కార్బోహైడ్రేట్లు ఎక్కు వగా తీసుకుంటున్నారు. తక్కువ పాలిష్ చేసిన బియ్యంతో పాటు, తినేవాటిలో ఎక్కువ చిక్కుళ్ళు, పప్పులు కలిపి తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని రీసెర్చర్స్ చెప్పారు