శంషాబాద్ లో సందడే సందడి : 10 దేశాల అందగత్తెలు రాక

శంషాబాద్ లో సందడే సందడి : 10 దేశాల అందగత్తెలు రాక

72వ మిస్ వరల్డ్ వేడుకలకు భాగ్యనగరం హైదరాబాద్ వేదిక కానున్న సంగతి తెలిసిందే.. ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ దేశాల నుంచి అందగత్తెలు, విదేశీ అతిధులు హైదరాబాద్ చేరుకున్నారు. కాగా.. ఇవాళ 10 దేశాల అందగత్తెలు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయంలో సందడి నెలకొంది.

బుధవారం ( మే 7 ) హైదరాబాద్ కు చేరుకున్న అందగత్తెల్లో మిస్ లాట్వియా మరీజా ఎలిజబెట్ మిసురోవా, మిస్ కజకిస్తాన్ సబీనా ఇడ్రోసోవా, మిస్ సింగపూర్ డెల్వినా కాటెరినా కె లూథర్, మిస్ డెన్మార్క్ ఎమ్మా హేస్ట్ థామ్సెన్,  మిస్ మంగోలియా ఎర్డెన్సువ్డ్ బాట్బయార్, మిస్ నికరాగ్వా రోడ్రిగ్జ్లాగు లు ఉన్నారు. వీరితో పాటు పలువురు విదేశీ అతిధులు హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో సాంప్రదాయ పద్దతిలో స్వగతం పలికారు అధికారులు

అయితే.. పాకిస్తాన్ భారత్ మధ్య తాజా పరిస్థితుల నేపథ్యంలో మిస్ వరల్డ్ వేడుకలపై సందిగ్థత నెలకొంది. భారత్ పాక్ మధ్య యుద్దవాతావరణమే సందిగ్థతకు కారణం. తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్వాహకులు షెడ్యూల్ మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న క్రమంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై డైలమాలో పడ్డారు నిర్వాహకులు. షెడ్యూల్ మార్పుపై ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి, మిస్ వరల్డ్ పోటీల షడ్యూల్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.