వెల్గటూర్ ఎంపీపీ కూనమల్ల లక్ష్మిపై అవిశ్వాసం

వెల్గటూర్ ఎంపీపీ కూనమల్ల లక్ష్మిపై అవిశ్వాసం

తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు వేగంగా మారుతుంది. వెల్గటూర్ ఎంపీపీ కూనమల్ల లక్ష్మిపై అవిశ్వస తీర్మానం ప్రవేశపెట్టారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని 15 మంది ఎంపీటీసీల్లో అవిశ్వసానికి 10 మంది ఎంపిటీసీలు మద్దతు పలికారు. జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ లో ఎంపిటీసీల అవిశ్వాస తీర్మాన పత్రాన్ని సమర్పించారు. 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎంపీపీ కేటాయిస్తే.. వెల్గటూర్ అభివృద్ధి సాధ్యమవుతుందని భావించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ నిధులు మంజూరులో తీవ్ర జాప్యం చేశారని విమర్శలు వచ్చాయి. గతంలో బీఆర్ఎస్ సర్కార్ లో సర్పంచ్ లు, ఎంపిటిసిల ఆత్మహత్యలే ఇందుకు నిదర్శమని ఆరోపణలు వచ్చాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ అధ్వర్యంలో ధర్మపురి అభివృద్ధి జరుగుతుందని ఎంపిటీసీలు నమ్మకం వ్యక్తం చేశారు.