బెంగళూరు : దేశంలో 10 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎనర్జీ కంపెనీ షెల్ ప్లాన్ చేస్తోంది. 2030 నాటికల్లా వాటిని పెట్టాలని చూస్తోంది. బెంగళూరులో మొట్టమొదటి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను గురువారం నాడు షెల్ ప్రారంభించింది. ఈ ఈవీ స్టేషన్లో టూ వీలర్లు, కార్లు ఛార్జ్ చేసుకునే వీలుంటుంది. టూ వీలర్ల కోసం మొదటగా ఇండియా మార్కెట్లోనే ఛార్జర్లను తెచ్చినట్లు ఈ సందర్భంగా షెల్ ప్రకటించింది. తమ కస్టమర్లకు సేఫ్, గ్రీన్, ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ సొల్యూషన్లు అందించాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
షెల్ రీ ఛార్జ్ స్టేషన్లను ఆ విధంగానే ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఫస్ట్ఫేజ్ కింద బెంగళూరులోని తన ఫ్యూయెల్ స్టేషన్లలోనే ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా షెల్ ఏర్పాటు చేస్తోంది. యశ్వంత్పూర్, ఓల్డ్ మద్రాస్ రోడ్, బ్రూక్ ఫీల్డ్, కనకపురలలో ఛార్జింగ్ స్టేషన్లను పెడుతున్నామని వివరించింది. తమకు రిటెయిల్ బిజినెస్ ఉన్న కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, అసోం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోనే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు షెల్ వెల్లడించింది.
