
ఏదైనా కష్టం వచ్చినపుడు ఒక తోడు కావాలి. వెంట నడిచే బలగం కావాలి. ఎందుకంటే,ఒక పదిలమైన ఇల్లు కట్టుకుంటేనే, ఆ ఇంటి గురించి పది తరాలు చెప్పుకున్నప్పుడు..అదే ఇంట్లో అందరం ఒక్కటిగా కలిసి ఉంటే ఇక ఎలా ఉంటుందో..ఆలోచించండి. అంతటి ఆలోచనని..భావోద్వేగాన్ని.. బలగం మూవీ ద్వారా అందరికీ అర్థమయ్యేలా చేశాడు డైరెక్టర్ వెల్డండి వేణు(Venu Yeldandi).
తాజాగా బలగం మూవీ ఓ అరుదైన ఘనతను సాధించింది. ఈ చిత్రం వందకు పైగా అంతర్జాతీయ అవార్డులను అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. "మా ప్రయాణానికి అద్భుతమైన గుర్తింపు. గతంలో ఓ సినిమా 100 రోజులు ఆడేది ఆ తర్వాత 100 సెంటర్లలో సినిమాలు ఆడేవి ఆ తర్వాత 100 కోట్ల వసూళ్లు చేసే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మేము 100 కు పైగా అంతర్జాతీయ అవార్డులను పొందిన చిత్రాన్ని ఘనతను అందుకున్నాం. 'బలగం' మాకు ప్రత్యేకమైన సినిమా" అంటూ పోస్ట్ చేసింది మూవీ టీమ్.
A journey of Excellence and Recognition! ❤️
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) July 4, 2023
Earlier, we had
Films running for 100 days..
Films running in 100 centers..
Films collecting 100 crores ..
Now, we have achieved a film with 100+ international awards ❤️#Balagam is a special film for many reasons ??#balagam pic.twitter.com/26yfgS8sse
బలగం మూవీ అందుకున్న ప్రతి అవార్డు చిన్న సినిమాలకు బలం అని చెప్పుకోవాలి. కథలో కంటెంట్ ఉంటే సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయినా అవొచ్చు అన్న దానికి నిదర్శనం బలగం మూవీ. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ మూవీ రికార్డు టీఆర్సీని సాధించింది.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేసిన బలగం సినిమాకు ఏకంగా 14.3 టీఆర్పీ వచ్చింది. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో టీఆర్పీ సాధించిన మూవీగా బలగం నిలిచింది. హైదరాబాద్ సెగ్మెంట్ లోనైతే ఏకంగా 22 రేటింగ్ తో సంచలనం సృష్టించింది బలగం మూవీ.
ఈ సినిమా సాధించిన విజయం తరువాత వేణు వెల్డండి మరో మూవీ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి వేణు ఎలాంటి కథను ఎంచుకున్నాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ మూవీ నుంచి అధికారిక వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.