ఇబ్రహీం పట్నంలో100 లీటర్ల కల్తీ పాలు సీజ్

ఇబ్రహీం పట్నంలో100 లీటర్ల కల్తీ పాలు సీజ్

ఎల్బీనగర్, వెలుగు: కెమికల్స్ తో పాలు తయారు చేసి హైదరాబాద్ నగరానికి సప్లయ్ చేస్తున్న ఓ పాల తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్‌‌ఓటీ పోలీసులు దాడి చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో  కల్తీ పాల తయారీ కేంద్రంపై పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. 

గ్రామానికి చెందిన అందె శ్రీశైలం (43) అనే వ్యక్తి పాలలో ప్రమాదకరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్పూర్ బ్రాండ్ మిల్క్ పౌడర్ కలిపి కృత్రిమంగా పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ కల్తీ పాలను హైదరాబాద్‌‌లోని కొన్ని ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. నిందితుడు శ్రీశైలం నుంచి100 లీటర్ల కల్తీ పాలు, లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్, 35 కిలోల ధోల్పూర్ బ్రాండ్ మిల్క్ పౌడర్‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.