ప్రభుత్వం ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ధర..?

ప్రభుత్వం ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ధర..?

సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ “కోవిషీల్డ్” జనవరి నుంచి ఫిబ్రవరి నాటికి 100 మిలియన్ల వ్యాక్సిన్లను సిద్ధం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ ఆధార్ పూనావాలా మీడియాకు తెలిపారు.

ఒప్పందంలో భాగంగా ఇప్పటికే 40 మిలియన్ల డోస్ లను ప్రభుత్వానికి అందించినట్లు, అదే విధంగా జనవరి నెలకు 100 మిలియన్లు, జులై నాటికి 300 నుంచి 400 మిలియన్ల డోస్ లను ఉత్పత్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నట్లు వెల్లడించారు.

ఇక తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఎంఆర్పీ రూ.1000గా ఉండగా..  ప్రభుత్వం అమ్మే కరోనా వ్యాక్సిన్ ధర రూ.250 లేదా అంతకంటే తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి రానుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆధార్ పూనావాలా చెప్పారు.