
పాక్ కవ్వింపు చర్యలకు బుద్ధి చెప్పేందుకు ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇంకా కొనసాగుతోందని ఆర్మీ ప్రకటించింది. పాక్ డ్రోన్స్, మిస్సైల్స్ తో భారత్ పై దాడికి దిగుతున్న తరుణంలో.. ఒకే ఒక్క బాహుబలి క్షిపణి.. ఆ దేశాన్ని దడదడ వణికించింది. పాక్ కు చెందిన 10 కీలక ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసేందుకు భారత్ అమ్ములపొంది నుంచి వదిలిన బ్రహ్మోస్.. ముఖ్యమైన ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసినట్లు భారత్ ప్రకటించింది. ఇందులో మురిద్, రఫిక్వీ, నూర్ ఖాన్ (చకాలా), రహిమ్యార్, సుక్కుర్, చునియన్ తదితర ఎయిర్ బేస్ లు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.
బ్రహ్మోస్:
పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేయడమే కాకుండా పాక్ తోకముడిచి అమెరికా ద్వారా రాజీకి వచ్చేలా చేసిన బ్రహ్మోస్ క్షిపణి.. ఇండియా-రష్యా సంయుక్తంగా 1998లో నిర్మించిన ప్రాజెక్టు. భూ, జల, గగనతలం.. ఇలా ఎక్కడి నుంచైనా లాంచ్ చేయగల క్షిపణి ఇది. అన్ని కాలాల్లో, అన్ని వాతావరణ పరిస్థితులలో ఈ క్షిపణి పనిచేసే లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.
బ్రహ్మోస్ ప్రత్యేకతలు:
రేంజ్: 450 కిలోమీటర్లపైనే. (800 కి.మీ. వరకు రేంజ్ కొనసాగిస్తున్నట్లు ప్రయోగాల్లో నిర్ధారించారు.)
స్పీడ్: సూపర్ సోనిక్ స్పీడ్. (Mach 2.8 నుంచి 3.0..) అంటే ధ్వని (sound) శబ్దానికంటే మూడు రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది.
లాంచ్: వాయు, జల, భూ, సబ్ మెరైన్ ల నుంచి కూడా లాంచ్ చేయవచ్చు.
ఖచ్చితత్వం (అక్యూరసీ): అడ్వాన్స్ డ్ గైడెన్స్, నావిగేషన్ ద్వారా టార్గెట్ మిస్ అవ్వకుండా రీచ్ కాగలదు.
పే లోడ్: హై ఎక్స్ ప్లోజివ్ (అత్యధిక పేలుడు) వార్ హెడ్ ను క్యారీ చేయగలదు.
ఇండియన్ నేవీలో బ్రహ్మోస్ వాడకం 2005 నుంచి ఉంది. INS Rajput లో మొట్టమొదటి బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించారు. 2007 నుంచి ఇండియన్ ఆర్మీలో కూడా వినియోగిస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ నూతన బ్రహ్మోస్ యూనిట్ ప్రత్యేకతలు:
రక్షణ శాఖ ఉత్రప్రదేశ్ లో నూతన బ్రహ్మోస్ యూనిట్ ను ఆదివారం (మే 11) ప్రారంభించింది. సంవత్సరంలో 80 నుంచి 100 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిలను తయారు చేసే కెపాసిటీ ఈ యూనిట్ కు ఉంది. తర్వాత 100 నుంచి 150 నెక్ట్స్ జెనరేషన్ మిస్సైల్స్ ను ఉత్పత్తి చేస్తారు.
బ్రహ్మోస్ క్షిపణి బ్రహ్మోస్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసింది. భారత్ కు చెందిన DRDO, రష్యాకు చెందిన NPO సంస్థలు సంయుక్తంగా తయారు చేశాయి. ఈ యూనిట్ లో తయారయ్యే మిస్సైల్స్ కు 290 నుంచి 400 కి.మీ. రేంజ్ ఉంటుంది.
త్వరలో తయారు చేయబోయే నెక్ట్స్ జెనరేషన్ బ్రహ్మోస్ మిస్సైల్స్ 1290 కేజీల బరువు మాత్రమే ఉంటాయి (ప్రస్తుతం 2,900 కేజీలు). సుఖోయ్ SU-300 వంటి ఒకేసారి మూడు ఫైటర్ జెట్లను తీసుకెళ్లడం వీటి స్పెషల్.