కేంద్ర నోటీసులకు X రెస్పాన్స్..3వేల500 అసభ్యకర పోస్టులు, 600 ఖాతాలు డిలీట్

కేంద్ర నోటీసులకు X రెస్పాన్స్..3వేల500 అసభ్యకర పోస్టులు, 600 ఖాతాలు డిలీట్

తన AI చాట్ బాట్ అశ్లీల కంటెంట్ కట్టడిపై కేంద్రం ఇచ్చిన నోటీసులకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం X స్పందించింది. అశ్లీల కంటెంట్ అరికట్టడంలో లోపాలను అంగీకించింది. భారతీయ చట్టాలకు లోబడి పనిచేస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకు స్పందించిన ఎలాన్ మస్క్ X ..3వేల 500లకు పైగా అశ్లీల కంటెంట్ ఉన్న పోస్టులను తొలగించింది.  దాదాపు 600 ఖాతాలను డిలీట్ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ ఉత్పత్తి కాకుండా చూస్తామని హామి ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. 

మహిళలు,మైనర్లు లక్ష్యంగా అసభ్యకరమైన ,అవమానకరమైన ఫొటోలు, వీడియోలను రూపొందించేందుకు షేర్ చేసుకునేందుకు  గ్రోక్  చాట్ బాట్ దుర్వినియోగం చేయబడిందని కేంద్ర దుర్వినియోగం చేయబడిందని  కేంద్రం గుర్తించిన తర్వాత X కు జనవరి 2న నోటీసులు జారీ చేసింది. అభ్యంతకర కంటెంట్ వెంటనే తొలగించాలని గ్రోక్ టెక్నికల్ ఆడిట్ చేయాలని, 72 గంటల్లో తీసుకున్న చర్యల రిపోర్టు ఇవ్వాలని  కేంద్రం ఆదేశించింది.