ఐదేండ్లలో 103 డిగ్రీ కాలేజీల మూత

ఐదేండ్లలో 103 డిగ్రీ కాలేజీల మూత

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీ లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఐదేండ్లలో 103 కాలేజీలు మూతపడ్డాయి. వీటిలో 91 ప్రైవేటు కాలేజీలు ఉండగా17 ఎయిడెడ్ కాలేజీలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు అప్పటి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పర్మిషన్ ఇచ్చింది. దీంతో కాలేజీలు భారీగా పెరిగిపోవడంతో  ఏటా సగానికి పైగా సీట్లు భర్తీ కాని పరిస్థితి ఏర్పడింది.

దీంతో అడ్మిషన్లు లేక కాలేజీలు మూతపడుతున్నాయి. దోస్త్ పరిధిలో 2018–19లో మొత్తం 1049 డిగ్రీ కాలేజీలుండగా, 2022–23 నాటికి ఆ సంఖ్య 946కు తగ్గింది. అదేవిధంగా ప్రైవేటు కాలేజీలు 859 నుంచి 768కి తగ్గగా, ఎయిడెడ్ కాలేజీలు 47 నుంచి 30కి తగ్గాయి. కాగా,  నాన్ దోస్త్ (మైనార్టీ, కోర్టుకెళ్లిన కేసులు) కాలేజీల సంఖ్య మాత్రం 49 నుంచి 63కు పెరిగింది.