ఎస్ఎస్ దుశ్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘గత వైభవ’. సింపుల్ సుని దర్శకత్వం వహిస్తూ దీపక్ తిమ్మప్పతో కలిసి నిర్మించారు. నవంబర్‌లో కన్నడలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు గ్రాండ్‌గా తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘గత వైభవం’ పేరుతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జనవరి 1న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. నాలుగు విభిన్న కాలాలలో ఈ మూవీ సాగుతుంది. కన్నడ వెర్షన్‌కు మంచి స్పందన లభించడంతో తెలుగులోనూ అంచనాలు పెరిగాయి. ప్రేమ, పురాణం, పునర్జన్మ , చారిత్రక నాటకం కలగలిసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తుందని నిర్మాతలు అన్నారు. జుడా శాండీ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
