- అసెంబ్లీలో వెంటనే విలీన బిల్లు పెట్టాలి: టీజీజీడీఏ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ను కార్పొరేషన్ వ్యవస్థ నుంచి రద్దు చేసి డైరెక్టరేట్ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్ హెచ్ఎస్) పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీజీజీడీఏ) డిమాండ్ చేసింది. ఈ నెల 25 వ తేదీ దాటినా జీతాలు రాలేదని, డాక్టర్ల జీతాల కష్టాలకు కార్పొరేషన్ లోకి మార్చడమే శాశ్వత పరిష్కారమని సూచించింది.
ఇందుకు సంబంధించిన విలీన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిఆమోదించాలని డిమాండ్ చేసింది. డాక్టర్లను అనిశ్చితిలోకి నెట్టకుండా ప్రతినెలా 1వ తేదీన జీతాలు వచ్చే వ్యవస్థను తీసుకురావాలని కోరింది. లేనిపక్షంలో తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతామని టీజీజీడీఏ ప్రెసిడెంట్ నరహరి బాపనపల్లి, సెక్రటరీ జనరల్ లాలు ప్రసాద్, ట్రెజరర్ ఎం. కె. రౌఫ్ బుధవారం హెచ్చరించారు.
