పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‌‌’ మూవీలో రాశి ఖన్నా పోర్షన్ కంప్లీట్

 పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‌‌’ మూవీలో రాశి ఖన్నా పోర్షన్ కంప్లీట్

స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ సౌత్‌‌లో క్రేజీ హీరోయిన్‌‌గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది రాశీ ఖన్నా. ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్‌‌’లోనూ ఆమె నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని తన పోర్షన్ షూటింగ్‌‌ పూర్తయిందని మేకర్స్ తెలియజేశారు. ఇందులో ఆమె  శ్లోక పాత్రలో కెమెరామెన్‌‌గా కనిపించనుందని, తన క్యారెక్టర్ సినిమాకు కీలకంగా ఉండనుందని మేకర్స్ తెలియజేశారు. 

ఈ సందర్భంగా సెట్‌‌లో ఆమెతో ఉన్న వర్కింగ్ స్టిల్స్‌‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తుండగా, సెకండ్ హీరోయిన్‌‌గా  రాశీ ఖన్నా కనిపించనుంది. మరోవైపు  పవన్ కళ్యాణ్ పోర్షన్ కూడా కంప్లీట్ కావడంతో  ప్రస్తుతం ఇతర నటీనటులతో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.   మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని   నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.