​సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 104 ఉద్యోగులు

​సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 104 ఉద్యోగులు

ఆర్మూర్, వెలుగు: 104 ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహాను కలిసి మెమోరాండం అందజేశారు.  గత 16 సంవత్సరాల నుంచి 104 ఉద్యోగులుగా ఉన్న తమను కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రతా కల్పించాలని, ప్రతీ నెలా జీతాలు వచ్చేలా చూడాలని కోరారు.

 సీఎం సమస్యల పరిష్కారానికి ప్రిన్సిపల్ సెక్రెటరీకి సూచించారని 104 ఉద్యోగులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన 104 ఉద్యోగులు యస్వాడ ప్రకాశ్, కె.కృష్ణ , జి.కృష్ణ, ప్రకాష్, ప్రవీణ్, పురుషోత్తం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.