లోన్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌ కేసులో 105 కోట్లు అటాచ్

లోన్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌ కేసులో 105 కోట్లు అటాచ్

హైదరాబాద్‌ : ఇన్‌‌‌‌‌‌‌‌స్టంట్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌ కేసులో ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇండిట్రేడ్‌‌‌‌‌‌‌‌ ఫిన్‌‌‌‌‌‌‌‌క్రాప్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్, అగ్లో ఫిన్‌‌‌‌‌‌‌‌ట్రేడ్, ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్​తో సహా మొత్తం 12 నాన్‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్సియల్‌‌‌‌‌‌‌‌ కంపెనీలకు చెందిన 233 అకౌంట్లను ఫ్రీజ్ చేశామని అధికారులు బుధవారం వెల్లడించారు. ఆ అకౌంట్లలో ఉన్న ఉన్న రూ.105.32 కోట్లను సీజ్ చేశామని చెప్పారు. 7 నుంచి 30 రోజల టైమ్ బాండ్‌‌‌‌‌‌‌‌తో ఆర్బీఐ రూల్స్​కు విరుద్ధంగా యాప్​ల ద్వారా లోన్లు ఇచ్చారని, చెల్లించనోళ్లను ఎక్కువ మిత్తీల కోసం వేధించారని తేల్చారు. 12 కంపెనీల ద్వారా ఇప్పటివరకు రూ.4,430 కోట్ల లోన్లు ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు. ఇందులో రూ.819 కోట్లు లాభం వచ్చినట్లుగా డిజిటల్‌‌‌‌‌‌‌‌ ఆడిట్‌‌‌‌‌‌‌‌లో అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం రూ.264 కోట్లు అటాచ్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటించారు.