కరోనాపై గెలిచిన 106 ఏండ్ల అవ్వ

కరోనాపై గెలిచిన 106 ఏండ్ల అవ్వ

థానే: వందేండ్లు దాటిన అవ్వ కరోనాను జయించింది. ఇటీవల వైరస్‌‌ బారిన పడ్డ ఆమె.. ఈజీగా దాన్నుంచి బయట పడింది. మహారాష్ట్రలోని డోంబీవలిలో ఉండే ఆ అవ్వకు ప్రస్తుతం 106 ఏండ్లు. ఇటీవల కరోనా టెస్టు చేస్తే పాజిటివ్‌‌గా తేలింది. తొలుత ఏ హాస్పిటల్‌‌ కూడా ఆమెను చేర్చుకోలేమని చెప్పాయని, చివరకు సవ్లరమ్‌‌ క్రీడా సంకుల్‌‌లో కల్యాణ్‌‌ డోంబీవలి మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ ఏర్పాటు చేసిన కొవిడ్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ ఫెసిలిటీ సెంటర్‌‌లో 10 రోజుల కిందట చేర్చామని బంధువులు చెప్పారు. డాక్టర్లు, మెడికల్‌‌ సిబ్బంది ఆమెను జాగ్రత్తగా చూసుకొని ట్రీట్‌‌మెంట్‌‌ చేశారన్నారు. కరోనా నుంచి కోలుకొని ఆదివారం డిశ్చార్జ్‌‌ అయ్యారని చెప్పారు. ఆ కొవిడ్‌‌ సెంటర్‌‌ను మేనేజ్‌‌ చేస్తున్న డాక్టర్‌‌ రాహుల్‌‌ ఘులే ఇదే విషయాన్ని ట్విట్టర్‌‌లో పోస్ట్‌‌ చేశారు. వైరస్‌‌ బారి నుంచి కోలుకున్న బామ్మ.. డిశ్చార్‌‌ కార్డు చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు.