
- నిధులు విడుదల చేస్తూజీవోలు ఇచ్చిన సర్కారు
హైదరాబాద్, వెలుగు: వివిధ లిఫ్ట్ఇరిగేషన్ స్కీములు, చెక్ డ్యాముల నిర్మాణాలు, పెండింగ్పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు గురు వారం ఉత్తర్వులను జారీ చేసింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని పండ్రేగుపల్లి గ్రామంలో మున్నేరు నదిపై ఆనకట్ట నిర్మాణానికి రూ.107.3 కోట్లు శాంక్షన్ చేసింది. అదే జిల్లా రఘునాథపాలెం మండలంలోని వెలుగుమట్లలో నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్రైట్ బ్యాంక్ వద్ద తలపెట్టిన కొడుమూరు వం దనం లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్ ఫేజ్ 2 పనులకు రూ.35.75 కోట్లను మంజూరు చేసింది. కరీంనగర్ జిల్లాలోని పోతిరెడ్డిపల్లిలో కలు వలవాగు వద్ద చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ.3.63 కోట్లను మంజూరు చేసింది.