ఏపీలో ఇవాళ ఒక్కరోజే 106 మంది మృతి

 ఏపీలో ఇవాళ ఒక్కరోజే 106 మంది మృతి
  • కొనసాగుతున్న కరోనా మరణమృదంగం
  • ఇవాళ 23 వేల 160 కొత్త కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 106 మంది మరణించారు. లాక్ డౌన్ ఆంక్షలు కఠినతరం చేస్తున్నా ఒకవైపు  కొత్త కేసులు.. మరో వైపు  మరణాలు రోజు రోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇవాళ 17 మంది చనిపోయారు. అదేవిధంగా నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాల్లో 11 మంది చొప్పున, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున, అనంతపురం, చిత్తూరు, కృష్ణా జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో 8 మంది చొప్పున, గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఒకరు చొప్పున కరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. 
ఇక కేసుల విషయానికి వస్తే గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 1 లక్షా ఒక వేయి 330 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా వారిలో 23 వేల 160 మందికి కరోనా సోకినట్లు తేలింది.  అనంతపురం జిల్లాలో 2334, చిత్తూరులో 2670, తూర్పు గోదావరి జిల్లాలో 3528, గుంటూరులో 1501, కడపలో 1221, కృష్ణాలో 1496, కర్నూలులో 1310, నెల్లూరులో 1239 మంది, ప్రకాశం జిల్లాలో 1590, శ్రీకాకుళం లో 1440, విశాఖపట్టణంలో 2007, విజయనగరంలో 945 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 1879 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అదేవిధంగా గడచిన 24 గంటల్లో 24 వేల 819 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారి ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయి వెళ్లినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.