కరీంనగర్ టౌన్: అల్ఫోర్స్ స్టూడెంట్లకు ఐఐటీ,ఎన్ఐటీల్లో సీట్లు

కరీంనగర్ టౌన్: అల్ఫోర్స్ స్టూడెంట్లకు  ఐఐటీ,ఎన్ఐటీల్లో సీట్లు

కరీంనగర్ టౌన్,వెలుగు: మొదటి రౌండు కౌన్సిలింగ్​ల ద్వారా 108 మంది అల్ఫోర్స్ విద్యార్థులకు జాతీయ స్థాయి ఐఐటి,ఎన్ఐటీల్లో  సీట్లు రావడం గొప్ప  విషయమని  చైర్మన్  వి.నరేందర్ రెడ్డి  శనివారం అన్నారు.    31 మంది విద్యార్థులు సీట్లు సాధించగా,  ఎన్ఐటిల్లో 36 మంది విద్యార్థులు, వివిధ ఐఐటీల్లో  16 మంది విద్యార్థులు సీట్లు సాధించారని,  25 మంది విద్యార్థులు వివిధ ఐఐఈఎస్ టీ,బీఐటీ,జీఎఫ్​ టీఐ,  ఎస్ఎన్ఐఈటీ,సీయుహెచ్ ల్లో సీట్లు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని పెంచినట్లు వివరించారు. 

యుజీఈఈ ద్వారా అల్ఫోర్స్ విద్యార్థి జి. ఆశిస్ రెడ్డి హైదరాబాద్ ఐఐఐటీలో సీటు  సాధించడం విశేషమన్నారు. ఐఐటి  జేఈఈ  మెయిన్స్  పర్సంటైల్ ద్వారా పటేల్ అక్షయ రెడ్డి హైదరాబాద్ ఐఐఐటీ  లో  సీటు సాధించినట్లు తెలిపారు.