మార్చి 16 నుంచి టెన్త్ ఎగ్జామ్స్...? ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాకా పరీక్షలు.. త్వరలో షెడ్యూల్ రిలీజ్

మార్చి 16 నుంచి టెన్త్ ఎగ్జామ్స్...? ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాకా పరీక్షలు.. త్వరలో షెడ్యూల్ రిలీజ్
  • సర్కార్‌‌కు ప్రతిపాదనలు పంపిన ఎస్ఎస్‌‌సీ బోర్డు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి16 నుంచి ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పలు తేదీలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఇటీవలే సర్కారుకు పంపించారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి13తో మెయిన్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తికానున్నాయి. ఆ పరీక్షల హడావుడి తగ్గిన వెంటనే, రెండు రోజుల గ్యాప్ ఇచ్చి మార్చి16 నుంచి టెన్త్ పరీక్షలు స్టార్ట్ చేయాలని ఆఫీసర్లు ప్లాన్ చేశారు. 

ఇదే నెలలో ఉగాది, శ్రీరామనవవి, రంజాన్, మహావీర్ జయంతి తదితర పండుగలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా, చదువుకునేందుకు వీలుగా ఒక్కో పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్యలో కనీసం ఒకటి లేదా రెండు రోజులు సెలవు ఉండేలా టైం టేబుల్ డిజైన్ చేశారు. 

ఈ లెక్కన మార్చి 16న మొదలయ్యే పరీక్షలు.. ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే, సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. ఒకటి రెండు రోజుల్లో అధికారిక షెడ్యూల్ రిలీజ్ కానుంది.