కోర్టు అనుమతి వచ్చిన తర్వాత 10వ తరగతి పరీక్షలు   

కోర్టు అనుమతి వచ్చిన తర్వాత 10వ తరగతి పరీక్షలు   

విద్యార్ధులకు  అకాడమిక్ ఇయర్ ఇబ్బందులు కలగకుండా  చర్యలు చేపట్టామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ కు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు.ఇందుకోసం 33 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. జూన్ రెండో వారంలో ఇంటర్మీడియట్ ఫలితాలు వస్తాయన్నారు.

ఈ ఏడాది 9.50 లక్షల మంది ఇంటర్మీడియట్  విద్యార్థుల పరీక్షలు రాశారని… ఇందులో 856 మంది విద్యార్థులకు ఒక పరీక్ష మిగిలిపోయిందని..ఆ పరీక్షను 18వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు కోర్టు అనుమతి తప్పనిసరన్నారు. కోర్ట్ కు  అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. అనుమతి వచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని… విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.