రూట్ మార్చిన గోల్డ్ మాఫియా.. ప్యాసింజర్లే క్యారియర్లు

రూట్ మార్చిన గోల్డ్ మాఫియా.. ప్యాసింజర్లే క్యారియర్లు

హైదరాబాద్ , వెలుగు: గోల్డ్​ స్మగ్లింగ్ కు గోల్డ్​ మాఫియా రూటు మార్చింది. మొన్నటి దాకా క్యారియర్ల ద్వారా గోల్డ్​ను అక్రమ రవాణా చేస్తే.. ఇప్పుడు నేరుగా ప్రయాణికులనే క్యారియర్లుగా మార్చాయి. ఆర్థికర్థి ఇబ్బందులుండి గల్ఫ్దేశాలకు వలస వెళ్న లి తెలంగాణ కార్మికులనే టార్గెట్ర్గె చేసుకున్నాయి. కరోనాతో అక్కడి నుంచి ఇక్కడకు వస్తున్న వారితో బంగారాన్ని అక్రమ రవాణా చేయిస్తున్నాయి. వివిధ దేశాల్లోచిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంఏర్పాటు చేసిన వందే భారత్ మిషన్ ఫ్లైట్లనే ట్రాన్స్​పోర్టింగ్ కు  ఎంచుకున్నాయి. గురువారం దామన్ నుంచి వచ్చిన స్పెషల్ వందేభారత్ ఫ్లైట్ లో 1 1 మందిని చెక్ చేసిన కస్టమ్స్​ అధికారులు.. రూ.కోటీ 66 లక్షల విలువైన 3.11 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నారు.

11 మంది క్యారియర్లు

దామన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికులను కమీషన్తో ట్రాప్ చేసింది గోల్డ్​మాఫియా. సుమారు180 మందితో బయలుదేరిన వందేభా రత్ ఫ్లైట్​లోని తెలంగాణ జిల్లాలకు చెందిన 11 మందిని తమకు క్యారియర్లుగా మార్చుకుంది.
ప్యాంట్బ్యాక్ప్యాకెట్లోపలి వైపు మరో జేబును ఏర్పాటు చేసి.. 200 నుంచి 300 గ్రాముల బరువు గల బంగారు అభరణాలపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్​లోని రిసీవరకు వాటిని అందజేస్తే రూ.15 వేల వరకు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. స్మగ్లిం గ్ సమాచారంఅందుకున్న కస్టమ్స్‌‌‌‌ఇంటెలిజెన్స్​అధికారులు.. దామన్ను ఫ్లైట్స్ ప్రయాణికులపై నిఘా పెట్టారు. అందరినీ చెక్చేశారు. ముందుగా ఇద్దరి దగ్గర గోల్డ్​బార్స్​ను గుర్తించారు. మొత్తంగా 11 మంది దగ్గర నుంచి కోటీ 66 లక్షల విలువైన 3.11 కిలోల గోల్డ్​బార్స్​ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాన్స్​పోరర్్టతో పాటు హైదరాబాద్ రిసీవర్ కు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు.

అరబ్ దేశాల ఫ్లైట్స్ పై స్పెషల్ ఫోకస్

లాక్డౌన్ సడలింపుల తర్వాత అరబ్ దేశాల నుంచి వచ్చే విమానాలపై కస్టమ్స్​ అధి కారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. యూఏఈ, ఖతార్​‌‌‌‌, ఒమన్, బహ్రెయిన్, కువైట్, మలేషియా నుంచి వందే భారత్ మిషన్ ఫ్లైట్లలో వచ్చే ప్యాసింజర్ల పై నిఘా పెట్టారు. ప్రయాణికులనే గోల్డ్​మాఫియా టార్గెట్ర్గె చేసిందని గుర్తించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ సిస్టమ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న ప్రయాణికుల డేటాను గోల్డ్​మాఫియా కలెక్ట్​చేస్తున్నట్టు తెలుసుకున్నా రు. పాస్ పోర్టు ను ​ఏజెంట్స్​తో కలిసి వారితో బంగారం అక్రమ రవాణాకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఇందులో భాగంగా ఆర్థిక ఇబ్బందులతో గల్ఫ్ కంట్రీస్ నుంచి సొంతూళ్ళ కు వస్తున్న వారికి డబ్బులు ఆశ చూపి గోల్డ్​ క్యారియర్లుగా మార్చినట్టు ఆధారాలూ సేకరించారు.