పాండిచ్చేరిలో ‘నేను రెడీ’ మూవీ సాంగ్ షూటింగ్ కంప్లీట్

పాండిచ్చేరిలో ‘నేను రెడీ’ మూవీ సాంగ్ షూటింగ్ కంప్లీట్

హవీష్ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేను రెడీ’. కావ్య థాపర్ హీరోయిన్. నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా కొత్త పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో హవీష్‌‌ మిడిల్‌‌ క్లాస్‌‌ మ్యాన్‌‌గా కనిపించాడు. యాక్షన్‌‌ సీన్‌‌కు సంబంధించిన స్టిల్ ఇదని అర్థమవుతోంది. 

శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌‌లో సుదీర్ఘ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.  బుధవారంతో పాండిచ్చేరిలో హీరోహీరోయిన్స్‌‌పై చిత్రీకరిస్తున్న సాంగ్ షూటింగ్ పూర్తయింది.   విజయ్ పొలాకి మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, విటివి గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.