భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నుంచి కొత్త పోస్టర్.. ఆకట్టుకుంటున్న రవితేజ లుక్

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నుంచి కొత్త పోస్టర్.. ఆకట్టుకుంటున్న రవితేజ లుక్

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల రూపొందిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. గురువారం  క్రిస్మస్ విషెస్ అందిస్తూ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ సాంటా క్యాప్ పెట్టుకుని, చేతిలో గిఫ్ట్ పట్టుకుని  ఫెస్టివ్ వైబ్‌‌లో కనిపించడం ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.

ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌‌గా కనిపించనున్నారు. రీసెంట్‌‌గా విడుదలైన టీజర్, పాటలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ  చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం రవితేజ మార్క్ ఫన్‌‌తో  ఆడియెన్స్‌‌ను హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌‌‌‌టైన్ చేసేలా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.