
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్లబావి కూలిన ఘటనలో 11 మంది చనిపోయారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని.. 11 మంది మృతదేహాలు బయటకు తీశామని..మరో 19 మందిని సిబ్బంది సురక్షితంగా రక్షించామని ఇండోర్ కలెక్టర్ డాక్టర్ టి. ఇళయరాజా వెల్లడించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మధ్రప్రదేశ్ సీఎం చౌహాన్.. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.
https://twitter.com/ANI_MP_CG_RJ/status/1641393913117171713
మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా స్నేహ్ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 కు పైగా మంది మెట్ల బావిలో పడిపోయారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలైనట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సమయంలో స్థానికులు సైతం బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తు్న్నారు. బావిలో పడిన వారిని రెస్క్యూ టీంతో పాటు నిచ్చెన సాయంతో బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు.