TGSRTC : గుడ్ న్యూస్ : జులై 1న ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్

TGSRTC : గుడ్ న్యూస్ : జులై 1న  ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్
  • ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం
  • 2017 అలవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లు, ఫ్రింజ్ బెనిఫిట్స్ 
  • 80 శాతం పెంచి ఇచ్చేందుకు ఓకే
  • ఆర్టీసీ అధికారుల నిర్ణయంపై జేఏసీ నేతల హర్షం

హైదరాబాద్, వెలుగు: సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన పలు సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ముందుకు వస్తున్నది. తక్కువ సమయంలోనే ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ఆర్టీసీ జేఏసీ నేతలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ వస్తోంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రకటించిన 11 శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ను జులై 1న ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. గురువారం ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమైన యాజమాన్యం.. వారి సమక్షంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 2017 అలవెన్స్ లతో పాటు ఫ్రింజ్ బెనిఫిట్స్ ను 80 శాతం పెంచి ఇచ్చేందుకు కూడా యాజమాన్యం అంగీకరించింది. వీటితో పాటు బ్రెడ్ విన్నర్ స్కీంలో ప్రస్తుతం పనిచేస్తున్న వారందరిని రెగ్యులర్  చేయడానికి అధికారులు అంగీకరించారు. ఇదే సమయంలో వీరి సర్వీసు సీనియార్టీని కొనసాగించేందుకు ఒప్పుకున్నారు. 

నెలాఖరులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

జూనియర్ అసిస్టెంట్ లుగా అర్హత పొందిన వారికి ఈ నెలాఖరులో పోస్టింగ్ ఇచ్చేందుకు కూడా అధికారులు ఆమోదం తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు 2017 వేతన సవరణ బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు, రుణం పొందేందుకు అంగీకరించారు.రిటైర్డ్ ఉద్యోగుల వైద్య ఖర్చులను రూ. 4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచేందుకు అంగీకరించారు. ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు ఆర్టీసీ ఎండీతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. తార్నాక ఆస్పత్రి లో పేషెంట్ తో పాటు వచ్చే అటెండెంట్ కు వసతి కల్పించేందుకు రూ. 40 లక్షలు నిధులతో విశ్రాంతి గదులు, డైనింగ్ హాల్ నిర్మాణానికి యాజమాన్యం అంగీకరించింది. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రెండు నెలలకు సరిపడా మందులు ఒకేసారి ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. మిగిలిన సమస్యలు తదుపరి జరగనున్న సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, జక్కుల మల్లేశం, హన్మంతు ముదిరాజ్ మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో యాజమాన్యం తరఫున ఈడీ స్థాయి అధికారులు పాల్గొన్నారు.  యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయాలపై ఆర్టీసీ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.