
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటేసేందుకు ఉదయం నుంచే ఓటరు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 10 గంటల వరకు 11 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ వెల్లడించింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
జనగామలో రైల్వే స్టేషన్ సమీపంలోని పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్., బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తొపులాట జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువసేపు పోలింగ్ బూత్ ఉంటున్నాడని కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో కాంగ్రెస్., బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలైంది. వెంటనే స్పందించిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.