కొడంగల్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం కొడంగల్ మున్సిపాలిటీ ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 11,668 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 5,661, మహిళలు 6,007 మంది ఉన్నట్లు కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. మార్పులు, చేర్పుల అనంతరం ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు.
2018లో కొత్తగా ఏర్పడిన కొడంగల్ మున్సిపాలిటీకి రెండో ఎన్నిక త్వరలో జరగనుంది. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కొడంగల్లో గుండ్లకుంట, ఐనన్పల్లి, పాతకొడంగల్, బుల్కాపూర్, పాతకొడంగల్ తాండాలను విలీనం చేసి గత ప్రభుత్వం మున్సిపాలిటీగా
అప్గ్రేడ్ చేసింది.
