బషీర్బాగ్, వెలుగు: ఈ నెల 15న నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11,226 కేసులను పరిష్కరించామని హైదరాబాద్ ఏసీపీ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ సైబర్ క్రైం, ట్రై కమిషనరేట్ లోని జోనల్ సైబర్ సెల్స్ లో 709 కేసులు పరిష్కరించి , బాధితులకు మొత్తం రూ.5,77,78,601 రిఫండ్చేశామన్నారు. ఇది రాష్ట్రంలోని అన్ని సైబర్ క్రైం యూనిట్స్ తో పోలిస్తే అత్యధిక రిఫండ్ అని తెలిపారు. రానున్న రోజుల్లో నేరాల నియంత్రణకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
