ఒకేరోజు 12 యాక్సిడెంట్లు : ఆరుగురు మృతి

ఒకేరోజు 12 యాక్సిడెంట్లు : ఆరుగురు మృతి

పదుల సంఖ్యలో
ప్రయాణికులకు గాయాలు
హైదరాబాద్​లో మహిళ

పైనుంచి వెళ్లిన టిప్పర్
హెల్మెట్, తల నుజ్జునుజ్జు
సిద్దిపేటలో సంపూర్ణేశ్ బాబు కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
మలక్​పేటలో 2 బస్సుల ఢీ

నారాయణ కాలేజీ డీన్ డ్రైవర్ ఖాసీం(25)ను శ్రీచైతన్య కాలేజీకి చెందిన ట్యాంకర్ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే  చనిపోయాడు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్​కు చెందిన ఖాసీం.. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉంటున్నాడు. కూకట్​పల్లి నారాయణ కాలేజీ డీన్ శ్రీకర్ ​దగ్గర కారు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. నిజాంపేట్ క్రాస్ రోడ్డు దగ్గర్లో ఓ ప్రైవేటు స్కూల్​లో చదువుతున్న శ్రీకర్ ​కుమారుడికి టిఫిన్ బాక్సు ఇచ్చి స్కూటీలో హిందు ప్రాజెక్ట్​లోని డీన్ ఇంటికి బయలుదేరాడు. ఇదే సమయంలో శ్రీచైతన్య కాలేజీకి చెందిన వాటర్ ట్యాంకర్ ఖాసీంను ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ వెనుక చక్రాల కింద పడి ఖాసీం నలిగిపోయాడు. ఇది గమనించకుండానే ట్యాంకర్ డ్రైవర్ 25 మీటర్ల వరకు డ్రైవ్ చేస్తూ వెళ్లాడు.

మహిళ తలపై నుంచి వెళ్లిన టిప్పర్‌ లారీ

టిప్పర్ లారీ ఢీకొని మహిళ మృతి చెందింది. హైదరాబాద్​లోని కుషాయిగూడ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. కాప్రాలో ఉండే కోలటి సరిత (35) తన స్కూటీపై వెళ్తుండగా.. టిప్పర్ లారీ ఢీకొట్టింది. లారీ ముందు టైర్ ​సరితపైకి ఎక్కింది. దీంతో హెల్మెట్ పగిలిపోయి తల నుజ్జునుజ్జయి సరిత అక్కడికక్కడే మృతి చెందింది.

బైక్​పైకి దూసుకెళ్లిన కారు.. యువకుడు మృతి

గుర్తుతెలియని కారు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామం దగ్గర ఈ ఘటన జరిగింది. కర్నాటకలోని బీదర్ కు చెందిన మారుతి(22) పటాన్ చెరువు లోని సాయిబాబా కంపెనీలో పని చేసుకుంటూ పటాన్​చెరులో ఉంటున్నాడు. బైక్​పై వెళ్తుండగా ముత్తంగి శివారులో వెనుకవైపు నుంచి ఒక గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. దీంతో మారుతి రోడ్ డివైడర్ పై పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు.

అన్నదమ్ములను ఢీకొన్న వెహికల్

బైక్ పై వెళ్తున్న అన్నదమ్ములను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందగా అన్నకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్ఖాన్ గూడలో జరిగింది. కోహెడ గ్రామానికి చెందిన సానెం శేఖర్ (40), సానెం ముత్యాలు కార్పెంటర్ పని చేస్తున్నారు. బుధవారం రాత్రి ఇద్దరు అనాజ్ పూర్ లో పని ముగించుకొని తమ బైక్​పై కోహెడకు బయలుదేరారు. దారి మధ్యలో వెళ్తుండగా ఉమర్ఖాన్ గూడ ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తమ్ముడు శేఖర్ స్పాట్​లోనే చనిపోయాడు. ముత్యాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ముత్యాలును హయత్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

డీసీఎం ఢీకొని ఒకరి మృతి

బైక్ ను డీసీఎం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఉదయ్ రాజ్(20), హమీద్ రంగారెడ్డి జిల్లా ఫరూఖ్​నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ శివారులోని నర్సరీలో పని చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం బైక్ పై షాద్ నగర్ టౌన్ వస్తున్నారు. టౌన్ శివారులో ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న ఉదయ్ రాజ్ అక్కడికక్కడే చనిపోయాడు. హమీద్ కు తీవ్రగాయాలయ్యాయి. హమీద్‌ ను షాద్ నగర్ లోని ప్రైవేట్ ​హాస్పిటల్​కు తరలించారు.

అక్కాచెల్లెళ్లు రోడ్డు దాటుతుండగా..

రోడ్డు దాటుతున్న అక్క చెల్లెళ్లను ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న కారు ఢీకొట్టి పల్టీ కొట్టింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ ఈ ఘటన జరిగింది. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబోల్​కు చెందిన వృద్ధులు వెంకటమ్మ, సత్తమ్మ.. సరూర్‌నగర్ జింకలబావి కాలనీలో ఉంటున్నారు. అమ్మనబోల్ లో బంధువులు చనిపోవడంతో వారిని చూసేందుకు గ్రామానికి వాళ్లిద్దరూ బయలుదేరారు. ఎన్టీఆర్‌ నగర్ వైపుగా వెళ్తుండగా ఉప్పల్ కు చెందిన హర్షిత్.. ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ తో కారులో వచ్చాడు. రోడ్డు దాటుతున్న వెంకటమ్మ, సత్తమ్మను తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ సమయంలో కారు తగలడంతో ఇద్దరు అక్కచెల్లెలకు తీవ్ర గాయాలయ్యాయి. కారు పల్టీలు కొడుతూ మెట్రో పిల్లర్​ను ఢీకొట్టింది. గాయపడ్డ అక్కచెల్లెళ్లను ఓజోన్ ఆసుపత్రికి తరలించారు

స్కూల్ ఆటో బోల్తా

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని గోదావరి రోడ్డులో ప్రైమరీ స్కూల్​స్టూడెంట్లతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. దీంతో ఐదుగురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. డాక్టర్లు ట్రీట్​మెంట్ అందిస్తున్నారు.

బైక్​ను ఢీకొట్టిన బస్సు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి మోటారు సైకిల్​ను ఢీకొట్టింది. దీంతో బైక్​పై వెళ్తున్న మల్లేశ్​కు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంబారి మల్లేశ్ బైక్​పై పాత బస్టాండ్​ వైపు వెళ్తుండగా, ఆర్టీసీ బస్టాండ్​కు వెళ్తున్న కోరుట్ల డిపో బస్సు అతివేగంగా ఢీకొట్టింది. మల్లేశ్​ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మల్లేశ్​ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.

–వెలుగు, నెట్​వర్క్:రాష్ర్టవ్యాప్తంగా బుధవారం 12 చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఆరుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వీరిలో పలువురికి సీరియస్​గా ఉంది. ఆర్టీసీ టెంపరరీ డ్రైవర్ల నిర్లక్ష్యంతో జరుగుతున్న యాక్సిడెంట్లు బుధవారం కూడా కొనసాగాయి. కొన్నిచోట్ల ఆర్టీసీ బస్సులు గుద్దుకోగా, మరికొన్ని చోట్ల బండి నడుపుతున్నవారిపై దూసుకెళ్లాయి. సిద్దిపేటలో సినీ నటుడు సంపూర్ణేశ్​బాబు కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆయన సురక్షితంగా బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని రాయికల్ జాతీయ రహదారిపై కారు ఢీకొట్టడంతో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి చనిపోయాడు. కమ్మదనం గ్రామానికి చెందిన వెంకటపతి రాజు(59) రాయికల్ దగ్గర్లో నర్సరీలో టమాట నారు తీసుకొని వెళ్తుండగా కారు వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ వెంకటపతి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు వెంకటపతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తల కోసం