జేఈఈ మెయిన్‌: ఆకాష్‌  ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులకు 99% పైగా మార్కులు

V6 Velugu Posted on Sep 16, 2021

ఆకాష్‌  ఇనిస్టిట్యూట్‌ .. తెలంగాణాకు చెందిన 12 మంది విద్యార్థులు  జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ 2021లో  99 పర్సంటేజ్  కు పైగా సాధించారు. ఈ పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులలో  శ్రీనికేతన్‌ జోషి (99.99%), గౌతమ్‌సింగ్‌ (99.96%), అన్మోల్‌ కురోథ్‌ (99.87%), మొహమ్మద్‌ అరీబుస్సేన్‌ (99.84%) మరియు కె ఎస్‌ మకరంద్‌ (99.76%) ఉన్నారు. తెలంగాణా నుంచి ఈ అసాధారణ ఫీట్‌ను సాధించిన 12 మంది విద్యార్థులను అభినందించారు ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌  ఆకాష్‌ చౌదరి.ఈ టాప్‌ పర్సంటైల్‌ మార్కులు సాధించడమన్నది విద్యార్థుల కష్టమని.. అంకిత భావంతో పాటు వారి తల్లిదండ్రుల మద్దతు గొప్పదన్నారు. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలను సాధించాలని కోరారు.

 

Tagged JEE Main Results, 12 Akash Institute students , 99% marks

Latest Videos

Subscribe Now

More News