
ఢిల్లీలో 2020-2021 సంవత్సరానికి గాను స్వచ్ఛ్ సర్వేక్షన్ అవార్డుల ప్రదానం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిదిగా హజరయ్యారు. స్వచ్చ సర్వేక్షన్, సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్, చెత్తరహిత నగరాల కేటగిరిలకు సంబంధించి అవార్డులు ఇవ్వనున్నారు. కాగా.. ఈ మూడు కేటగిరిలలో కలిపి తెలంగాణకు మెత్తం 12 అవార్డులు దక్కాయి. స్వచ్ సర్వేక్షన్ విభాగంలో సిరిసిల్ల, ఘట్కేసర్, జీహెచ్ఎంసీ, సిద్దిపేట్, నిజాం పేట్, ఇబ్రహీంపట్నం, కోస్గి, హుస్నాబాద్ మున్సిపాలిటిలు అవార్డులు దక్కించుకున్నాయి. చెత్తరహిత నగరంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌కి అవార్డు లభించింది. సఫాయి మిత్ర సురక్ష ఛాలేంజ్ విభాగంలో రాష్ట్రాల కేటగిరిలో తెలంగాణకు, నగరాల కేటగిరిలో కరీంనగర్‌కు అవార్డులు దక్కాయి. రాష్ట్రం తరపున ఈ అవార్డులను మంత్రి కేటీఆర్ అందుకోనున్నారు.