V6 News

తెలంగాణలో ఏ కులం లేనివాళ్లు (నో కాస్ట్) 12 లక్షల మంది

తెలంగాణలో ఏ కులం లేనివాళ్లు (నో కాస్ట్) 12 లక్షల మంది


తెలంగాణలో 36 లక్షల 57 వేల 551 (10.3%) జనాభాతో మాదిగ కులం అతిపెద్ద సామాజికవర్గంగా నిలిచింది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కుల గణన సర్వేకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం బుధవారం బయటపెట్టింది. ఉపకులాలవారీగా జనాభా వివరాలను వెల్లడించింది. మాదిగ కులం తర్వాత 27 లక్షల 95 వేల 727 (7.9%) మందితో షేక్ ముస్లింలు రెండోస్థానంలో నిలవగా, 26 లక్షల39 వేల 027 (7.4%) మందితో ముదిరాజ్ సామాజిక వర్గం మూడో స్థానాన్ని ఆక్రమించింది.

ALSO READ  : బీసీ (బి) వర్గాల్లో గౌడ, పద్మశాలీల ఆధిపత్యం

పట్టణాల నుంచి ‘నో కాస్ట్’ 

ఈ సర్వేలో అత్యంత ఆసక్తికరమైన అంశం ‘నో కాస్ట్’ గా  దాదాపు 12 లక్షల మంది ప్రజలు తమను తాము నమోదుచేసుకున్నారు. వీరు రాష్ట్ర జనాభాలో 3.4 శాతంగా ఉండి, జనాభా పరంగా పదో పెద్ద వర్గంగా అవతరించారు. వీరి ప్రొఫైల్ పరిశీలిస్తే వీరంతా ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో నివసించే విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులని తేలింది. ఐఏఎస్, ఐపీఎస్‌లాంటి ఉన్నత ఉద్యోగాల్లో వీరి ప్రాతినిధ్యం ఏకంగా 22.9 శాతంగా ఉంది. సామాజికంగా వీరు వెనుకబడి లేకపోయినా, కుల గుర్తింపును వదులుకోవాలని కోరుకుంటున్నారు. కాగా, వీరిలో 43 శాతం మంది వద్ద ఇంకా కుల ధ్రువీకరణ పత్రాలు ఉండటం, రిజర్వేషన్లు పొందుతుండడం గమనార్హం. ఇది సమాజంలో వస్తున్న మార్పుకు సంకేతంగా నిలుస్తోంది.