బంగారు గాజులతో అక్రమంగా దుబాయ్ నుండి హైదరాబాద్ కు..

బంగారు గాజులతో అక్రమంగా దుబాయ్ నుండి హైదరాబాద్ కు..

హైదరాబాద్: విదేశాల నుండి అక్రమంగా బంగారం తరలిస్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద దొరికిన బంగారం గాజుల విలువ రూ.12.04 లక్షలు పైనే ఉంటుందని కస్టమ్స్ అధికారుల అంచనా. 
శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను రొటీన్ గా తనిఖీలు చేస్తున్నారు. అయితే దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలపై అనుమానంతో తనిఖీలు చేయగా 244.150 గ్రాముల బంగారం గాజులు కనిపించాయి. నిందితుడు బంగారాన్ని గాజులుగా తయారు చేసి తరలించేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుని విచారణ చేపట్టారు. పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్లో 12.04 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

 

ఇవి కూడా చదవండి 

17 సార్లు జైలుకెళ్లి వచ్చినా.. భార్యతో కలిసి మళ్లీ చోరీలు

రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన రైతు సంఘం నేత
రేపట్నుంచి షర్మిల రైతు ఆవేదన యాత్ర

బాత్రూంలు బాగోలేవని బాలిక ఫిర్యాదు.. క్లీన్ చేసిన మంత్రి