రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన రైతు సంఘం నేత

రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన రైతు సంఘం నేత

చండీగఢ్: పంజాబ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది. రైతు సంఘాల నేత గుర్నామ్ సింగ్ చదుని కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. 40 రైతు సంఘాలు ఉన్న సంయుక్త కిసాన్ మోర్చాలో హర్యానా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చదుని. 
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు సందర్భంగా గుర్నామ్ సింగ్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలుషితమైన రాజకీయాలను మార్చాల్సి ఉందన్నారు. ప్రభుత్వాలు పెట్టుబడిదారులను ప్రమోట్ చేస్తున్నాయని, వారికి అనుకూలంగానే పాలసీలు రూపొందిస్తున్నాయని  ఆయన ఆరోపించారు. సాధారణ ప్రజలు, పేదల కోసం ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదని విమర్శించారు. అందుకే తాము సొంతంగా సంయుక్త సంఘ పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి 


బాత్రూంలు బాగోలేవని బాలిక ఫిర్యాదు.. క్లీన్ చేసిన మంత్రి

ఐఏఎంసీకి హైదరాబాదే బెస్ట్ ప్లేస్: సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోవచ్చు.. పెళ్లి చేసుకోకూడదా?

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి?