ఐఏఎంసీకి హైదరాబాదే బెస్ట్ ప్లేస్

ఐఏఎంసీకి హైదరాబాదే బెస్ట్ ప్లేస్

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటుకు హైదరాబాదే బెస్ట్ ప్లేస్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. నానక్ రామ్ గూడాలోని వీకే  టవర్స్ లో ఐఏఎంసీ ప్రారంభమైంది. ఈ సెంటర్ ను జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రస్టీలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమా కోహ్లి,  సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీతోపాటు టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.  

ఇది నా సిటీ

హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఐఏఎంసీలో అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు ఉన్నాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘ఇది నా నగరం. అందుకే ఈ సిటీపై నాకు అభిమానం ఎక్కువ. దేశంలో అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. వ్యాపారం, వాణిజ్యంలో ఇండియాలోని టాప్ డెస్టినేషన్స్ లో ఒకటిగా ఈ నగరం ఎదుగుతోంది. ఐఏఎంసీ ఏర్పాటులో భాగం పంచుకోవడం ద్వారా ఈ నగర అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నాననే సంతోషం ఉంది. ఈ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు హైదరాబాద్ కు ఉన్నాయి. దీంట్లో నేను కొత్తగా చేసిందేమీ లేదు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు మధ్య వారధిలా ఉంటుందీ నగరం. వివిధ ప్రాంతాలు, వేర్వేరు మతాలు, కులాల ప్రజలు ఇక్కడ కలసిమెలసి ఉంటున్నారు. కాబట్టి ఐఏఎంసీ ఏర్పాటుకు ఇంతకుమించిన బెస్ట్ ప్లేస్ లేదు’ అని ఎన్వీ రమణ చెప్పారు.  

మరిన్ని వార్తల కోసం:

హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ కాబోతోంది

18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోవచ్చు.. పెళ్లి చేసుకోకూడదా?

దళిత బంధు అర్హుల బాధ్యత ఎమ్మెల్యేలదే..