రేపట్నుంచి షర్మిల రైతు ఆవేదన యాత్ర

రేపట్నుంచి షర్మిల రైతు ఆవేదన యాత్ర
  • సీఎం సొంత జిల్లా మెదక్ నుంచి యాత్రకు శ్రీకారం

హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు షర్మిల రైతు ఆవేదన యాత్ర చేయబోతున్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ నుంచి రైతు ఆవేదన యాత్రను మొదలుపెట్టనున్నారు. రేపు మెదక్ జిల్లా నర్సాపూర్, ఆందోల్ నియోజకవర్గాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పనున్నారు షర్మిల. మొదటి విడతలో రేపటి నుంచి ఈ నెల 22వరకు మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ యాత్రలో 16 నుంచి 20 రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. జనవరి 17 వరకు అన్ని జిల్లాల్లో పర్యటించేలా రైతు ఆవేదన యాత్ర కు ప్లాన్ చేశారు. జనవరి 20 తర్వాత మహాప్రస్థానం పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు.

ఆందోల్ నియోజకవర్గం జోగిపేటలో రైతు కుటుంబానికి పరామర్శ

రేపు ఉదయం మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం, జోగిపేట్ మండలంలోని రైతు కుటుంబాన్ని వైయస్ షర్మిల పరామర్శిస్తారు. అక్కడి నుంచి నర్సాపుర్ నియోజకవర్గం కంచనపల్లికి వెళ్తారు. కంచనపల్లిలోని ఇద్దరు రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ తర్వాత కౌడిపల్లి మండలం లింగంపల్లిలో మరొక రైతు కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు.

 

 

ఇవి కూడా చదవండి 

17 సార్లు జైలుకెళ్లి వచ్చినా.. భార్యతో కలిసి మళ్లీ చోరీలు

రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన రైతు సంఘం నేత
బాత్రూంలు బాగోలేవని బాలిక ఫిర్యాదు.. క్లీన్ చేసిన మంత్రి